ఇటీవల యువ దర్శకుడు నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి హను రాఘవపూడితో ఫౌజీ, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ అశ్విన్ తో కల్కి 2 అలానే మారుతీ తీస్తున్న ది రాజా సాబ్.
అయితే ఈ సినిమాలు అన్నింటిపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక వీటిలో ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ ది రాజా సాబ్. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్స్, స్టైల్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కాగా ఈ మూవీ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేసారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కోరుకునే కమర్షియల్ అంశాలు అన్ని ఈ మూవీలో ఉన్నాయని అంటోంది యూనిట్.