Home సినిమా వార్తలు Prabhas Taking Bold Risk in Crucial పెద్ద రిస్కే చేస్తున్న ప్రభాస్  

Prabhas Taking Bold Risk in Crucial పెద్ద రిస్కే చేస్తున్న ప్రభాస్  

prabhas

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా విజయాలతో మంచి జోరు మీదున్నారు. గత ఏడాది డిసెంబర్ లో సలార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ప్రభాస్, ఇటీవల జూన్ లో కల్కి 2898 ఏడి మూవీ ద్వారా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అవి ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ. అయితే వీటిలో ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా, ఏడాది చివర్లో స్పిరిట్ ఆపై ఏడాది ఫౌజీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వీటిలో సలార్ 2, కల్కి 2 అయితే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. వీటి అనంతరం తాజాగా హను మన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఒక మూవీకి పచ్చ ​జెండా ఊపినట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, ప్రస్తుతం హీరోగా ప్రభాస్ ఒకింత పెద్ద రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. 

ముఖ్యంగా మారుతీ కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లో లేరు. ఇక ప్రశాంత్ వర్మ, ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి లకు పెద్ద హీరోలతో చేసిన అనుభవం లేదు. కేవలం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఒకరకంగా ఈ ముగ్గురు దర్శకుల సినిమాలతో ప్రభాస్ రిస్క్ చేస్తున్నారని, అయితే స్టార్ హీరో అయినప్పటికీ అటువంటి దర్శకులని ప్రోత్సహిస్తున్న ప్రభాస్ ని మెచ్చుకోకతప్పదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version