పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల నాగ అశ్విన్ తీసిన భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. దీపిక పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలని పోషించారు.
దీని అనంతరం ఓవైపు మారుతీతో ది రాజా సాబ్ మూవీ చేస్తోన్న ప్రభాస్, మరోవైపు హను రాఘవపూడితో ఒక మూవీ అలానే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
విషయం ఏమిటంటే, ఇటీవల ఆనిమల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కోసం స్పిరిట్ స్టోరీని పూర్తి చేసి ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో పట్టాలెక్కనుండగా దీనిని 2026 మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.