పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నాగ అశ్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైతిలాజికల్ మూవీ కల్కి 2898 తో పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన సలార్ కూడా విజయం అందుకున్న విషయం తెల్సిందే. ఇక తన రాబోయే ప్రాజక్ట్స్ పై మరింత దృష్టి పెట్టనున్నారట ప్రభాస్. అయితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో మెజార్టీ ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క దృష్టి ఆయనతో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ పైనే ఉంది.
ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా దీనిని యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్రాండ్ గా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట సందీప్. విషయం ఏమిటంటే, ఈ మూవీలో మా డాంగ్ సియోక్ అనే కొరియన్ యాక్టర్ గా నటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే దాని పై ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం స్పిరిట్ మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం భారీ స్థాయిలో ఉంటాయని, వాటిని పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కించేలా సందీప్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇక బడ్జెట్ పరంగా కూడా స్పిరిట్ కి ఎక్కువనే కేటాయించనుండగా ప్రభాస్ ని ఇప్పటివరకు చూడని విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్. మొత్తంగా ఈ మూవీ గురించిన అన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.