బాహుబలి తరువాత ప్రభాస్ స్టార్డమ్ అమాంతం పెరిగిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సీరీస్ తరువాత వచ్చిన సినిమాలు నిరాశపరిచినా అతను నెక్స్ట్ చేయబోయే సినిమాల పైన ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు ప్రేక్షకుల్లో.
నెక్స్ట్ ప్రభాస్ లైనప్ లో ఉన్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా సాలార్ ను చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ సీరీస్ తరువాత దేశంలో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగిపోతోంది. Ntr తో సినిమా కంటే ముందుగానే సాలార్ పట్టాలెక్కింది.
అయితే కేజీఎఫ్ 2 తరువాత నెటిజన్స్ తమదైన క్రియేటివిటీతో ఆ చిత్రం పార్ట్ 3 రాబోతుంది అని, అందులో సాలార్ కూ చోటు ఉంటుంది అని రకరకాల ఊహాగానాలతో సోషల్ మీడియా ను ఊపెస్తున్నారు.
అయితే ఆ రూమర్స్ లో కొంచెం నిజం ఉండే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది. రాకీ భాయ్ యూనివర్స్ లో సాలార్ కలిసి వస్తే అది ప్రేక్షకులకి ఖచ్చితంగా కన్నుల పండగే. మరి ఈ పుకార్లకి ఒక ముగింపు పలకాలి అంటే సాలార్ టీజర్ తోనే తేలుతుంది.