ప్రభాస్ సాలార్ చిత్రం షూటింగ్ 85 శాతం వరకూ పూర్తయిందని, క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ చిత్రం మరో ఆరు నెలలలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2023 సెప్టెంబర్ లో థియేటర్లలోకి వస్తుందని హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్ వెల్లడించారు.
‘సాలార్’ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ చిత్రం ‘ధూమమ్’, కన్నడ యాక్షన్ మూవీ ‘బగీరా’, కీర్తి సురేష్ తో తమిళ చిత్రం ‘రఘుతాట’ను హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది.
హోంబలే ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ తమ సంస్థ దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
కాగా వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో సినిమా వ్యాపారంలో రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని వారు యోచిస్తున్నారని ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వినోద పరిశ్రమ పరిధి మరింత పెరుగుతుందని వారు నమ్ముతున్నట్లు తెలిపారు.
విజయ్ ప్రకారం వారి రాబోయే చిత్రాల తాలూకు కథలు మిశ్రమ అంశాలను కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం తమ బ్యానర్ లో ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయని చెప్పారు.
ప్రస్తుతం దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేయాలనే ఆలోచనలో వారు ఉన్నారు. సాంస్కృతికంగా పాతుకుపోయిన కథల ద్వారా విస్తృత స్థాయిలో ప్రేక్షకులను చేరుకోవడం తమ లక్ష్యమని నిర్మాత విజయ్ చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరోను వెండితెర పై చూడటానికి చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు, వారు ఆయనని తెరపై చూసి 9 నెలలు అయ్యింది మరియు మళ్ళీ ప్రభాస్ ను తెర పై చూడటానికి వారు ఇంకాస్త సమయం వేచి ఉండవలసి ఉంటుంది.