Homeసినిమా వార్తలుప్రభాస్ సాలార్ విడుదల తేదీ ఖరారు

ప్రభాస్ సాలార్ విడుదల తేదీ ఖరారు

- Advertisement -

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ సీరీస్ సినిమాలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి అలాంటి దర్శకుడితో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చేస్తున్నారు అంటే అభిమానుల్లోనే కాకుండా ఇతర ప్రేక్షకులని మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘ సాలార్’ అద్భుతంగా ఉండబోతుందని ప్రభాస్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవల ప్రభాస్ చేసిన సినిమా ‘రాధేశ్యామ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయిన విషయం తెలిసిందే. అందువల్ల ఆయన అభిమానుల దృష్టి అంతా ‘ సాలార్’ పైనే ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు భారీ సినిమాలలో నటిస్తున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ‘ఆది పురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది.

ఇక ‘మహానటి’ తో ఎన్నో ప్రశంసలను అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమాని చేస్తున్నారు. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మరియు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 50 శాతం వరకు చిత్రీకరణని పూర్తి చేసుకుందని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. ఇక త్వరలో మరి కొన్ని షెడ్యూల్స్ లో మిగతా సినిమాని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

అభిమానుల దృష్టిలో తమ హీరో ప్రభాస్ నుంచి తాము ఆశించే మాస్ అంశాలు, కిక్ ఎక్కించే ఫైట్లు సాలార్ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ప్రభాస్ అభిమానులు ‘ సాలార్’ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ ఎలాంటి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సాలార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

READ  బింబిసార సీక్వెల్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం - కళ్యాణ్ రామ్

ప్రభాస్ అభిమానులు ఆనందించే వార్తను సాలార్ చిత్ర యూనిట్ 75వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా చెప్పారు. అనూహ్యంగా సాలార్ చిత్ర యూనిట్ ఈరోజు సినిమా విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది.

దీంతో ప్రభాస్ అభిమానులు ఉత్సాహంతో సోషల్ మీడియా వేదికగా ‘సలార్ ఆగమనం’ అనే హ్యాష్ ట్యాక్ ని వైరల్ ట్రెండ్ సంబరాలు జరుపుకున్నారు. మరి వారి ఆశలు, అంచనాలు అన్నీ నిజం చేసే సత్తా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఉందా లేదా అనేది చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  గాార్గి ట్రైలర్: మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్న సాయి పల్లవి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories