పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నాగ అశ్విన్ తీసిన భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈమూవీలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన తదితరుల కీలక పాత్రలు చేసారు.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన కల్కి ఇంకా థియేటర్స్ లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. దీని అనంతరం ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో హను రాఘవపూడి తీయనున్న యాక్షన్ మూవీ కూడా ఒకటి. రెండవ ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే, ఈ క్రేజీ లో ప్రాజక్ట్ లో ప్రభాస్ కి జోడీగా ఇంటర్నేషనల్ డ్యాన్సర్ కం మోడల్ అయిన ఇమాన్ ఇస్మాయిల్ నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇప్పటికే తన ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ని దర్శకుడు హను ని ఆమె ఫాలో అవుతున్నారు. మరోవైపు దర్శకుడు హను కూడా ఆమెను ఫాలో బ్యాక్ చేస్తుండడంతో వారి మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండడం కన్ఫర్మ్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.