Homeసినిమా వార్తలుPrabhas: ఆన్ లైన్ లో లీక్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న మారుతి సినిమాలోని ప్రభాస్...

Prabhas: ఆన్ లైన్ లో లీక్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న మారుతి సినిమాలోని ప్రభాస్ లుక్

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజా డీలక్స్ అనే టైటిల్ దాదాపుగా ఖరారు అయింది. మారుతి గతంలో మహానుభావుడు, ప్రేమకథా చిత్రమ్, పక్కా కమర్షియల్ వంటి సినిమాలతో పాటు 3 రోజెస్ వంటి వెబ్ సిరీస్ కు కూడా దర్శకత్వం వహించారు. మారుతి లాంటి చిన్న దర్శకుడితో తమ అభిమాన హీరో పనిచేయడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు.

అయితే ఈ సినిమా నుండి గతంలో లీకైన పిక్స్ వల్ల ప్రభాస్ ను కొత్త లుక్ లో చూసి వారు సంతోషించారు మరియు ప్రభాస్ ను ఇంత బాగా చూపించినందుకు వారు దర్శకుడు మారుతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా నుండి ప్రభాస్ కొత్త లుక్ ఇంటర్నెట్ లో లీక్ అవ్వగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. లీకైన పిక్ లో కాస్ట్యూమ్, పొడవాటి జుట్టు, గడ్డం ఇలా అన్నీ బాగా కుదిరి ప్రభాస్ చాలా బాగున్నారు అని అందరూ అంటున్నారు.

2022 డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో ప్రభాస్ తాతగా, మనవడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ఇది వరకే ఖరారు కాగా ఇప్పుడు తాజాగా లీకైన పిక్స్ తో రిద్ధి కుమార్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలిసిపోయింది.

READ  Allu Arjun: కొత్త సినిమా కోసం చేతులు కలిపిన అల్లు అర్జున్ మరియు సందీప్ రెడ్డి వంగా

సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాల్లో ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఆ సినిమాలు అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చాయి.ఆ సినిమాల దర్శకులు ప్రభాస్ ని బెస్ట్ గా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యారని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా మారుతి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రభాస్ ని బెస్ట్ అండ్ స్టైలిష్ గా చూపించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Ranga Marthanda: రంగ మార్తాండ స్పెషల్ షో నుంచి పాజిటివ్ రిపోర్ట్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories