Homeసినిమా వార్తలుకొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగులను మొదలు పెట్టిన ప్రభాస్

కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగులను మొదలు పెట్టిన ప్రభాస్

- Advertisement -

ఇటీవలే.. తెలుగు సినీ దిగ్గజ నటులలో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ లోంచి ప్రభాస్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. అందుకే ఆయన తన సినిమాల షూటింగ్‌లకు కొంత విరామం తీసుకున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఇప్పుడు సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అంతే కాకుండా రాబోయే రెండు నెలలు కూడా నిరంతర షెడ్యూల్స్ మరియు డెడ్‌లైన్‌లతో బిజీగా ఉండనున్నారట.

ముందుగా ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సాలార్ చిత్రం తాలూకు షూటింగ్ ఇప్పటికే పునఃప్రారంభించారు. కాగా ఆ చిత్రం యొక్క యాక్షన్ సన్నివేశాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. రాబోయే రెండు నెలలు యంగ్ రెబల్ స్టార్ చాలా తీవ్రమైన పనిలో మునిగి ఉండటమే కాకుండా చాలా సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది.

సాలార్ సినిమా కోసం శారీరకంగా చాలా కష్టాన్ని ఇచ్చే పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ప్రభాస్ అటు నుంచి ప్రాజెక్ట్ కే సెట్స్‌కి వెళ్లనున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రం సైన్స్ ఫిక్షన్ కధాంశంతో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే, అలాగే ఇండియన్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించినున్నారు.

READ  ప్రభాస్ బర్డ్ డే రోజు ఫ్యాన్స్ ట్రిపుల్ హంగామా

ఈ సినిమాల షూటింగ్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ తన తదుపరి చిత్రం అయిన ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా విరివిగా పాల్గొనాల్సి ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే వీఎఫ్ఎక్స్ వర్క్ తాలూకు పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్, టీజర్ మరియు ఇతర ప్రచార చిత్రాలు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వీటన్నింటి తర్వాత కూడా ప్రభాస్ తీరిక తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ తర్వాత దర్శకుడు మారుతీతో హారర్ కామెడీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నిజానికి ఈ సినిమా ఇంకా ఉందనే వార్తతో ప్రభాస్ అభిమానులు పెద్దగా సంతోషించరనేది నిజం. కానీ ఈ సినిమా భవిష్యత్తులో కార్యరూపం దాల్చేలానే కనిపిస్తోంది.

బాహుబలి ఫ్రాంచైజీ వంటి భారీ సినిమాలు చేసిన తర్వాత, ప్రభాస్ తర్వాతి అయిదు సంవత్సరాలు కాస్త నిరాశాజనకమైన సినిమాలను పొందారు. అయితే ఇప్పుడు వచ్చే తరువాతి అయిదు సంవత్సరాలలో తిరిగి తన స్థాయిలో ఉండే సినిమాలకు అందించాలని ఆశిస్తున్నారు. ఆయన ఆశలు నెరవేరాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  అశ్వినీదత్ మాటలకు ఆశ్చర్య పోయిన ప్రభాస్ అభిమానులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories