Homeసినిమా వార్తలుబాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 2 లో ప్రభాస్ - గోపిచంద్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 2 లో ప్రభాస్ – గోపిచంద్

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ 2 షోకు ప్రభాస్ వస్తున్నారనే వార్త దాదాపు ఖాయం అంటున్నారు. అన్‌స్టాపబుల్‌ 2 యొక్క రెండవ సీజన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ షోకు వచ్చి బాలయ్య కలిసి ప్రేక్షకులను అలరించారు.

ఇక చివరిగా ప్రసారమైన ఎపిసోడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులు ఇండస్ట్రీ విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి ఈ షోకు వస్తున్నారనేది తాజా వార్త. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ నెల 11 నుంచి అంటే రేపే ప్రారంభం కానుంది. అలాగే, ఈ ఎపిసోడ్ ను అన్ స్టాపబుల్ 2 సీజన్ యొక్క చివరి ఎపిసోడ్ గా జోడించనున్నట్లు చెబుతున్నారు.

ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన ‘వర్షం’ చిత్రంలో గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కూడా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.

ప్రభాస్ తో తనకున్న సాన్నిహిత్యం గురించి గోపీచంద్ పలు సందర్భాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఇప్పుడు బాలయ్య తన షోలో ఈ మ్యాచో మెన్ లు ఇద్దరితో కలిసి ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.

READ  ఈరోజు ఓటిటిలో విడుదలైన ఆరు తెలుగు సినిమాలు

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మొదటగా ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే సాలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  తన ఆరోగ్యం గురించి చెప్తూ భావోద్వేగానికి గురైన సమంత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories