Home సినిమా వార్తలు మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

Script Changes For Prabhas-Maruthi Film

బాహుబలి తరువాత వరుసగా భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. కాస్త రిలీఫ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు మారుతితో ఒక హారర్ – కామెడీ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం పై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎవరో కొంత మంది తప్ప అందరు అభిమానులు ప్రభాస్ ఈ సినిమాని చేయడం పట్ల ఏ మాత్రం సుముఖంగా లేరు.

కాగా మధ్యలో మారుతి తో ప్రభాస్ చేయబోయే ప్రాజెక్ట్ నిలిపివేయబడిందని పుకార్లు రావడంతో అవి నిజమేనని అందరూ భావించారు. ప్రభాస్ అభిమానులు కూడా ఈ వార్త విని ఎంతగానో సంతోషించారు. అయితే వారిని నిరాశకు గురిచేస్తూ ఈ రోజు ప్రభాస్, మారుతిల సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమం జరిగింది.

నిజానికి దర్శకుడు మారుతి నిన్న మొన్నటి వరకూ నిలకడగా విజయాలను అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా చిత్రంగా ఆయన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి . ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు చిత్రాల ఫలితాలు కెరీర్ దారుణంగా ఉండటంతో ఆశ్చర్య పోవడం అందరి వంతూ అయింది.

మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అలాంటి నేపథ్యంలో ప్రభాస్‌కు ఉన్న పలుకుబడి దృష్ట్యా, మారుతీతో ఆయన తదుపరి సినిమా చేయడం గురించి ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆయనకు ఉన్న స్టార్‌డమ్ మరియు మార్కెట్ విలువను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కారణంగా అభిమానులుఈ కాంబినేషన్ తో సంతోషంగా లేరు.

బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ భారీ హిట్ సాధించలేదు.. అందుకే ఆయన ఎప్పుడు మళ్ళీ భారీ విజయం సాధిస్తారు అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మారుతి తో సినిమా వద్దని ఆయన అభిమానులు ట్విట్టర్‌లో #BoycottMaruthi అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సాలార్ సినిమాల పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొంది, కానీ మారుతి చిత్రానికి మాత్రం ఎవరూ అంత ఆసక్తితో ఉన్నట్లు కనిపించట్లేదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version