Homeసినిమా వార్తలుఅన్నా..ఆ సినిమా వద్దు అంటున్న ప్రభాస్ అభిమానులు

అన్నా..ఆ సినిమా వద్దు అంటున్న ప్రభాస్ అభిమానులు

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె ఇలా ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ఆషామాషీ చిత్రాలు కావు. ఇంతటి భారీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ప్రభాస్ ఏమాత్రం అలసిపోకుండా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

అలాగే వరుస భారీ పాన్ ఇండియా సినిమాల మధ్యలో ఒక చిన్న ఎంటర్టైనర్ సినిమా తీయాలి అనే ఉద్దేశ్యంతో దర్శకుడు మారుతి తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి ఇప్పటికే పలు మార్లు వార్తలు వచ్చినా,ఇటీవల పక్కా కమర్షియల్ పబ్లిసిటిలో భాగంగా మారుతి ఆ విషయాన్ని మరోసారి నిర్ధారించారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.గతంలో ప్రేమకథాచిత్రమ్ అనే సూపర్ హిట్ హారర్ కామెడీని రూపొందించారు కాబట్టి అలాంటి సినిమా అయితే విజయానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి.

అయితే ఈ వారం విడుదల అయిన పక్కా కమర్షియల్ ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అటు కంటెంట్ పరంగా ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా కూడా సినిమా దెబ్బ తినడంతో,ప్రభాస్ అభిమానులు మారుతి తో సినిమా పై ఆందోళన చెందుతున్నారు.ముందు నుంచీ ప్రభాస్ అభిమానులు ఈ కాంబినేషన్ పట్ల సుముఖంగా లేరు.భారీ పాన్ ఇండియా సినిమాల మధ్య ఈ సినిమా.ఎందుకు అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ పరాజయంతో వాళ్ళ వాదనకు బలం చేకూరింది అనే చెప్పాలి.

READ  హరిహర వీరమల్లు ఆగిపోయిందా?

అయితే ప్రభాస్ అభిమానులతో పాటు మరో వ్యక్తి కూడా ఈ సినిమా తెరకెక్కడానికి ఇష్టపడటం లేదు.ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రాజెక్ట్ కె ప్రొడ్యూసర్ అశ్విని దత్. తెలుగు సినీ పరిశ్రమలో అశ్విని దత్ పరపతి గురించి చెప్పనవసరం లేదు. తన అల్లుడు నాగ్ అశ్విన్ ని దర్శకుడిగా పెట్టి ప్రాజెక్ట్ కె సినిమా పై వందల కోట్ల బడ్జెట్ పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతోంది అని ,ఇలాంటి భారీ సినిమా చేస్తున్న నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం సరికాదని అశ్విని దత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతారు అనేది అందరికీ తెలిసిందే. బాహుబలి సీరీస్ తరువాత కూడా అగ్ర దర్శకులతో చేసే అవకాశం ఉన్నా, కేవలం మాట ఇచ్చారనే కారణంతో సుజిత్.. రాధాకృష్ణ వంటి దర్శకులతో సినిమాలు తీశారు. మరి ప్రభాస్ యధాతధంగా మారుతితో సినిమా చేస్తారా లేక అభిమానులు కోరుకున్నట్లు సినిమా ఆగిపోతుందా లేదా చూడాలి.

READ  కన్ఫ్యూజన్ లో మెగాస్టార్ చిరంజీవి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories