Homeసినిమా వార్తలుProject K: రెండు భాగాలుగా విడుదలవనున్న ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ కే

Project K: రెండు భాగాలుగా విడుదలవనున్న ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్ కే

- Advertisement -

ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ప్రకటించిన రోజు నుంచే అదిరిపోయే హైప్ క్రియేట్ చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ ఇద్దరూ విజువల్స్ పరంగా ప్రాజెక్ట్ కే లోని ప్రపంచం భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని దృశ్యాలని అందిస్తుందని ధృవీకరించారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ మెంటార్ గా వ్యవహరించడం కూడా సినిమా పై అంచనాలను మరింత పెంచింది.

ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే విషయంలో మేకర్స్ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి, పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాల మాదిరిగానే ప్రాజెక్ట్ కే కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా విడుదలయ్యే సమయానికి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది.

కాగా మొదటి భాగం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాగ్ అశ్విన్, అశ్వనీదత్ లు ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి తమ స్టేట్ మెంట్స్ తో అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో రికార్డులను తిరగరాసే అవకాశం ఈ సినిమాకి ఉంది.

READ  Project K: ప్రభాస్ ఫ్యాన్స్ ను.. ప్రేక్షకులను నిరాశపరచిన ప్రాజెక్ట్ కే చిత్ర బృందం

ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. వెండితెర పై ఒక భారీ చిత్రాన్ని చూపించడానికి జరిగే పూర్తి స్థాయి కొత్త ప్రయత్నమని అన్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనెతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories