టాలీవుడ్ స్టార్ యాక్టర్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా మారుతీతో ది రాజా సాబ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇప్పటికే దీనితో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో పెట్టారు ప్రభాస్. వాటిలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2, నాగ అశ్విన్ కల్కి 2898 ఏడి 2, హను రాఘవపూడి మూవీ చేయనున్నారు ప్రభాస్. అయితే వీటితో పాటు తాజాగా ప్రముఖ కన్నడ భారీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారితో ప్రభాస్ మూడు సినిమాల ఒప్పందాన్ని తాజాగా కుదుర్చుకున్నారు.
నిన్న అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ ఒప్పందంలో భాగంగా ప్రశాంత్ నీల్ సలార్ తో పాటు ఆ సంస్థలో లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ లతో ప్రభాస్ మూవీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ మూడు సినిమాలకు గాను ప్రభాస్ ఏకంగా రూ. 600 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోనున్నారట. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతంలో కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో భారీ లాభాలు అందుకున్న విజయ్, త్వరలో ప్రభాస్ తో నిర్మించనున్న ఈ మూడు భారీ మూవీస్ తో ఎంతమేర విజయాలు సొంతం చేసుకుంటారో చూడాలి.