Home సినిమా వార్తలు Adipurush: ఆల్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీమ్

Adipurush: ఆల్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీమ్

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేమికుల లోనూ మంచి బజ్, ఆసక్తిని ఏర్పడేలా చేసింది. ఓం రౌత్ దగ్గర ఏముందో, భారీ వీఎఫ్ఎక్స్ తో రామాయణాన్ని ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఆదిపురుష్ టీజర్ విడుదలై అందరినీ నిరాశపరచడమే కాక ఓం రౌత్ మరియు చిత్ర బృందానికి దాదాపు అన్ని వర్గాల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో చిత్ర బృందం తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్లి విజువల్ ఎఫెక్ట్స్ పై తిరిగి పని మొదలు పెట్టింది.

విఎఫ్ఎక్స్ ను మెరుగుపర్చడానికి చిత్ర బృందం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం వెచ్చించడంతో ముందుగా అనుకున్న తేదీకి ఈ సినిమా విడుదల కావడం లేదు. జూన్ 16న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది.

విడుదలకు ఇంకా 150 రోజులు మిగిలి ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టనుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితమైన కార్యక్రమాలతో దేశవ్యాప్త ప్రమోషనల్ క్యాంపెయిన్ భారతదేశంలోని నగరాల్లో జరగనుంది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అంతే భారీ స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version