బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ స్టార్డం ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత వచ్చిన సాహో అనుకున్న విధంగా విజయం సాధించలేదు సరికదా ప్రభాస్ అభిమానులను నిరాశ పరిచింది. అంతే కాకుండా ఇటీవలే విడుదలైన రాధే శ్యామ్ కూడా బాక్స్ ఆఫీసు వద్ద భారీ డిజాస్టర్ నిలిచింది.అయితే వరుస పరాజయాల తరువాత కూడా ఆయన మార్కెట్ కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సాలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. అవి రెండూ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో అభిమానుల్లో ఆయా సినిమాల పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక వాటి కంటే ముందే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.ఈ చిత్రాన్ని జనవరి 12,2023 న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ప్రారంభించింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఏకంగా 250 కోట్లు చెల్లించి దక్కించుకుందట. ఇది నిజంగానే కళ్ళు చెదిరే అమౌంట్. ఇది కేవలం ప్రభాస్ అనే పేరుకు ఉన్న బ్రాండ్ వాల్యూ వల్ల సాధ్య పడిందని చేప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన అంటే సీత పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టాకీ పార్టు షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. అలాగే ఈ చిత్రానికి చిత్రీకరణ అయిన తరువాత ఆ గ్రాఫిక్స్ ను సన్నివేశాలకు జోడిస్తారు అని తెలుస్తోంది.
మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని 3D టెక్నాలజీలో కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. హాలీవుడ్ టెక్నిషియన్లులు గ్రాఫిక్స్ విభాగంలో పని చేస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడిగా వ్యవహరిస్తూ సహా నిర్మాతగా కూడా పాలు పంచుకుంటున్నారు. టీ సీరీస్ బ్యానర్ మరియు రెట్రోఫైల్స్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయిర్ నిర్మిస్తున్నారు.