Home సినిమా వార్తలు Pawan Kalyan: 2024 సంక్రాంతికి విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

Pawan Kalyan: 2024 సంక్రాంతికి విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజీత్ తో ఇటీవలే ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఎంత గానో నచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని వాళ్ళు అనుకుంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ శంకర్ ల RC 15 సినిమా సంక్రాంతి నుండి 2024 సమ్మర్ కు వాయిదా పడటంతో… పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా ఇప్పుడు ఆ డేట్ కు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం భారతీయుడు 2, పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుండగా, ఈ పోటీలో మరో పెద్ద స్టార్ సినిమా కూడా జత కానుంది.

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఖచ్చితంగా తమ అభిమాన హీరో కెరీర్ లో ఒక భారీ సినిమా అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ చిత్రానికి టైటిల్ ఇంకా పెట్టకపోయినా ప్రస్తుతానికి OG అని వర్కింగ్ టైటిల్ నియమించారు. కాగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు చాలా స్కోప్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇక జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సోదరుడి పాత్రలో ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమా గురించి ఈ మధ్య కాలంలో కొన్ని రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఇలాంటి కథలు మరిన్ని వస్తాయని.. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎటువంటి ఆందోళనకు గురి కావటం లేదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version