పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందానికి ఓ కారణం దొరికింది. యువ దర్శకులైన హరీష్ శంకర్, సాహో సినిమా ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ తాజాగా సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించింది.
ఈ రెండు సినిమాల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండూ రీమేక్ లు కాకుండా ఒరిజినల్ కథల మీద ఆధారపడి ఉంటాయి. ఇది ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల ట్రెండ్ కు భిన్నంగా ఉండటమే అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుజీత్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నారు. కాగా ఈ రెండు నిర్మాణ సంస్థలు ఈ చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇటీవలి కాలంలో సినిమాల పై కాస్త ఆసక్తి తగ్గింది. ఇక సినిమాలు తన నటనా పరాక్రమాన్ని సంతృప్తి పరచడం కంటే ఆదాయం కోసం మాత్రమే చేస్తున్నానని ఆయన ఇదివరకే బహిరంగంగా అంగీకరించారు.
అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒప్పుకున్న సినిమాలను తీసేది కమర్షియల్ డైరెక్టర్స్ కావడంతో పాటు వారిద్దరూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు కావడంతో ఈ సినిమాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయని పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు తమకు కావాల్సిన విజయాన్ని, ఆనందాన్ని అందిస్తాయని వారు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు దర్శకులు ఒకేసారి తమ సినిమాలను.షూట్ చేస్తారట. పవన్ తన రాజకీయ లక్ష్యాలకు తోడ్పడే విధంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వీలైనన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.