పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన “అన్‌స్టాపబుల్ 2” ఎపిసోడ్ నిన్న ఆహాలో ప్రసారం కాగా, ఊహించినట్లుగానే ఈ ఎపిసోడ్ రేటింగ్స్ ని హోరెత్తించింది. ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ గా నిలిచిన ఈ ఎపిసోడ్ కు పవన్ స్మాల్ స్క్రీన్ పై చాలా పరిమితంగా కనిపిస్తారనే కారణం వల్ల హైప్ పెరిగింది.
ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్ ను పబ్లిసిటీ చేయడానికి, హైప్ చేయడానికి ఆహా టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది మరియు ఆహా సబ్ స్క్రైబర్లలో కొత్త రికార్డ్ కూడా నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇప్పుడు అత్యంత వేగంగా 100 మిలియన్ నిమిషాలు ప్రసారం చేసినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పేర్కొంది. ఈ ఎపిసోడ్ లైవ్ లోకి వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఆహా మొబైల్ అప్లికేషన్ అత్యధికంగా యాప్ లాంచ్ అయింది.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ 2 షోకి నిజానికి పాపులారిటీ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ నటించిన ఎపిసోడ్స్ రేటింగ్ ఛార్టులను అమాంతం పెంచేశాయి. ఈ హైప్ ను క్యాప్చర్ చేయడానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్స్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వారు డిసైడ్ అయ్యారు.
అందుకే మొదటి ఎపిసోడ్ కి ట్రైలర్ నుంచే చాలా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు ఆహా వారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి తెలిసిందే కదా. తమ హీరోకి సంభందించిన ఏ విషయాన్ని అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా అందరి హైప్ కి తగ్గట్టే ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.