Homeబాక్సాఫీస్ వార్తలుBox-office: నిరాశ పరుస్తున్న లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్

Box-office: నిరాశ పరుస్తున్న లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్

- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “లాల్ సింగ్ చడ్డా”, ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ పాత్రలో, నాగ చైతన్య , మోనా సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. లాల్ సింగ్ చడ్డా సినిమా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది. 


అయితే సినిమా విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బజ్ అయితే రాలేదు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో పాటు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే అనూహ్యంగా రెండింటి మీద ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. లాల్ సింగ్ నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరిగాయి అని చూస్తే ఇప్పటివరకూ కేవలం 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది.


అయితే ఇంకా రిలీజ్ కు ఒక రోజు సమయమే ఉండగా ఇంత తక్కువ స్థాయిలో సినిమాకి క్రేజ్ ఉండటం పలువురు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా బాలీవుడ్ లో బుకింగ్స్ కంటే థియేటర్ల వద్దకు వచ్చి చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ. ఆ రకంగా చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్లు బాగానే వస్తాయి అని కొందరు అంటున్నారు. అయితే ఎలా చూసుకున్నా ఒక అగ్ర హీరొ రేంజ్ కు తగ్గట్టు ప్రేక్షకులు టికెట్ల కోసం ఆతృతగా లేరని అర్థమైపోయింది. టాక్ మరియు రివ్యూస్ చూసిన తరువాతే సినిమా వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారు.

READ  ధనుష్ "సార్" టీజర్ రివ్యూ


లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్ దక్షిణ సినిమాలైన కెజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ కన్నా చాలా తక్కువ ఉండటం గమనార్హం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్లలో పికప్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఏమాత్రం టాక్ తారుమారు అయినా.. ఈ చిత్రంతో తమ పూర్వ వైభవం దక్కించుకోవలని ఆశిస్తున్న బాలీవుడ్ కు నిరాశ తప్పదు.

హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చడ్డాని హిందీలో కంటే ఎక్కువ అమీర్ తెలుగులోనే ప్రచారం చేయడం విడ్డూరంగా కొంతమంది అనుకుంటున్నారు. తెలుగులో లాల్ సింగ్ చడ్డా సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు పబ్లిసిటీ పనుల్లో కూడా పాలు పంచుకున్నారు, అలాగే ప్రీమియర్ షో కూడా వేయించి వీలయినంత క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఓటిటిలో రికార్డు డీల్ సెట్ చేసుకున్న ఆది పురుష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories