ప్రస్తుతం భాషలకు అతీతంగా సౌత్ నుంచి నార్త్ వరకు సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో పూజా హెగ్డే హవా నడుస్తోంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పూజా వరసగా ఆఫర్స్ కొట్టేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే విజయ్ సరసన నటించిన బీస్ట్ ఫ్లాప్ అయినా, మరో తమిళ స్టార్ సూర్య ఈ బుట్టబొమ్మతో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. అయినా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఆఫర్స్ ని వదులుకోవడం లేదు. తమిళ డైరెక్టర్ శివ సూర్య 40వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పూజాహెగ్డేనే హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూర్య 41వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి సూర్య సరసన నటిస్తుండగా, నిర్మాతగా కూడా వ్యవహరించనున్న సూర్య, ఆల్రెడీ భారీ బడ్జెట్ తో మొదలు పెట్టి ఆగిపోయిన శివ కాంబినేషన్లో 40వ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఆ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను సంప్రదించారు.
ఈ ఏడాది ఇదివరకే వేసవిలో విడుదలైన బీస్ట్ తో పాటు “ఆచార్య” లో రామ్ చరణ్ సరసన నటించిన పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న “జనగణమన” లోనూ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ” కభీ ఈద్ కభీ దీవాలీ” లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా మరో ముఖ్య పాత్ర లో కనిపిస్తుండటం విశేషం.