Homeసినిమా వార్తలుపొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ విడుదల ఎప్పుడంటే?

పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ విడుదల ఎప్పుడంటే?

- Advertisement -

దక్షిణ భారత దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1 సెప్టెంబర్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ సోదరుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా చుట్టూ ఏర్పడిన హైప్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులు సృష్టించడంలో సహాయపడింది.

ఇదివరకు అందిన అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల 2023 వేసవిలో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

కోలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అద్భుతమైన సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తమిళంలో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది మరియు కేవలం తమిళ భాష నుండి 400 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా నిలిచింది. అలాగే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఆ రకంగా ఈ చిత్రం 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం, నాల్గవ-అత్యధిక తమిళ చిత్రం మరియు భారతీయ చలనచిత్రాలలో పదిహేనవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్‌ను తమిళ నూతన సంవత్సర సీజన్‌లో ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 28, 2023న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

చోళుల శత్రువులతో సాగిన యుద్ధం తర్వాత, నందిని (ఐశ్వర్యరాయ్) యొక్క ద్విపాత్రాభినయం మరియు అరుల్మోళి (జయం రవి) మరియు వందియ దేవన్ (కార్తీ) బతికే ఉన్నారా అనే రహస్యం గురించిన కథాంశం చుట్టూ ఉన్న ప్రశ్నల తాలూకు పెద్ద కుట్రతో పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ముగిసింది. మొదటి భాగం చుట్టూ ఉన్న హైప్ తో పాటు భారీ స్థాయిని బట్టి సీక్వెల్ నిస్సందేహంగా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

READ  పోన్నియిన్ సెల్వన్ పై భారీ అంచనాలు పెట్టుకున్న తమిళ ఇండస్ట్రీ

ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, సీక్వెల్ యొక్క తుది విడుదల తేదీని నిర్మాతలు ఒక నెలలోపు ప్రకటిస్తారట. 1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు అధ్యాయాల నవల “పొన్నియిన్ సెల్వన్” ఈ సినిమా కథాంశానికి ఆధారం. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలను ఎలాంగో కుమారవేల్ మరియు బి. జయమోహన్ రాశారు. మద్రాస్ టాకీస్ ద్వారా మణిరత్నం మరియు లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్ అల్లిరాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్, మరియు ఆర్. పార్తిబన్, ఈ సినిమా సిరీస్‌లోని సమిష్టి తారాగణం. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చగా, రవివర్మన్ ఈ చిత్రానికి కెమెరా వర్క్ చూసుకున్నారు. ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్‌ని నిర్వహించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories