Homeసినిమా వార్తలుబాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో ఇతర భాషల్లో రాణించలేకపోయిన పొన్నియిన్ సెల్వన్

బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో ఇతర భాషల్లో రాణించలేకపోయిన పొన్నియిన్ సెల్వన్

- Advertisement -

దిగ్గజ దర్శకుడు మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం చేయబడి, తమిళ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించింది. అయితే తమిళ భాష మినహా ఇతర భాషల్లో ఈ సినిమా కలెక్షన్లు గొప్పగా లెవనే చెప్పాలి. ఇతర భాషల్లో ఈ సినిమాకి జరిగిన బిజినెస్‌ని బట్టి మరికొన్ని కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉన్నా, సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలకు చేరువైంది.

అంతే కాక ఇతర భాషలలో ఈ చిత్రం రన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. హైదరాబాద్ లాంటి నగరంలో కేవలం రెండు వారాలకే మైన్ థియేటర్లో పొన్నియిన్ సెల్వన్ సినిమాని తీసేసి ఒక ఊరూ పేరూ లేని సినిమా వేయడం గమనార్హం.

పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా దాదాపు160 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో అధిక శాతం తమిళ వెర్షన్ నుంచే వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

READ  డిజె టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ మార్పు

ప్యాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో ఇతర భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అందరూ ఊహించారు, అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. నిజానికి తమిళ హీరోలైనా.. విక్రమ్ మరియు కార్తీలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అలాగే ఐశ్వర్యరాయ్, త్రిష అంటే తెలుగు వారిలో తెలియని వారుండరు. వీటన్నిటితో పాటు మణిరత్నం సినిమా కావడంతో తెలుగులో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పొన్నియిన్ సెల్వన్‌ సినిమాకి విడుదలకు ముందు సరైన బజ్ రాలేదు. విడుదలైన తర్వాత కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగా వచ్చాయి.

బాహుబలి, కేజీఎఫ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. బాహుబలి బాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టించి యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. KGF1 తెలుగు, హిందీ మరియు తమిళ భాషలలో కూడా మంచి స్థాయిలో బిజినెస్ చేసింది. మొదటి భాగాల నుండి వచ్చిన క్రేజ్ సహాయంతో, బాహుబలి2 మరియు KGF2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో టాప్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

READ  ప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్

వాటి తరహాలోనే ఫ్రాంచైజీ చిత్రం అయిన పొన్నియిన్ సెల్వన్ తమిళంలో అయితే భారీ విజయం సాధించింది. కానీ ఇతర భాషల్లో మాత్రం అదే తరహా ప్రభావం చూపించలేకపోయింది. ఇతర భాషల్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కారణంగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మరిప్పుడు పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ ఇతర భాషలలో ఎలా బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories