ఈ వారం విడుదల కానున్న మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, జయం రవి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రం గురించి, తెలుగు ప్రేక్షకుల ఆదరణ గురించి చిత్ర బృందం సుదీర్ఘంగా మాట్లాడింది.
ఈ సినిమా స్థాయి, గ్రాండియర్ గురించి మణిరత్నం మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాలను ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించడానికి మార్గం సుగమం చేసింది ఎస్ ఎస్ రాజమౌళి ఏ అని అన్నారు. బాహుబలి గనక రెండు భాగాలుగా విడుదలయి ఇంతటి విజయం సాధించకపోయి ఉంటే పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా ఊహించడం ఆయనకు కష్టమయ్యేది అని తెలిపారు.
మణిరత్నం చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం అనే చెప్పాలి. బాహుబలి ఘనవిజయం వల్లే పొన్నియిన్ సెల్వన్, కేజీఎఫ్, పుష్ప, రోబో వంటి చిత్రాల నిర్మాతలు పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించి విడుదల చేసే పరిస్థితి ఏర్పడింది.
పొన్నియిన్ సెల్వన్ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నిజానికి అంతగా ఆశాజనకంగా లేవనే చెప్పాలి. అయితే మణిరత్నం అండ్ కో పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.