గత సెప్టెంబర్ లో విడుదల అయిన మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం ఇతర భాషా ప్రేక్షకుల పై అంతగా ప్రభావం చూపించడంలో విఫలమై ఉండవచ్చు, కానీ తమిళంలో మాత్రం ఘన విజయం సాధించింది. అందుకే ఈ చిత్రం యొక్క రెండవ భాగం భారీ బజ్ ను కలిగి ఉంది. పొన్నియిన్ సెల్వన్ 1 బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్ మార్క్ లను సృష్టించింది, ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ గా ప్రారంభమయ్యాయి.
పీఎస్ 2 ఓవర్సీస్ బుకింగ్స్ ఇటీవలే ఓపెన్ కాగా, యూఎస్ఏలో ఇప్పటికే ప్రీ సేల్స్ 200K చేరువలో ఉన్నాయి. మరి అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలన స్థాయిలో ప్రారంభం కావడంతో ప్రీమియర్స్ నుండే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్కును తాకే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయం రవి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. అశ్విన్ కాకుమాను, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తిబన్, లాల్, మోహన్ రామన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి, మాటలు: జయమోహన్, కాస్ట్యూమ్స్: ఏకా లఖానీ, మేకప్: విక్రమ్ గైక్వాడ్, కొరియోగ్రఫీ: బృంద.