Home సినిమా వార్తలు Ponniyin Selvan 2 1St day collections: పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ డే ఆల్...

Ponniyin Selvan 2 1St day collections: పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ డే ఆల్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్స్

మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం శుక్రవారం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోగా, విమర్శకులు కూడా మణిరత్నం క్లాసీ కథనం, ఆయన చూపిన పటుత్వానికి ప్ర శంసలు కురిపించారు. ఈ చిత్రం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.28 కోట్ల వసూళ్లు సాధించింది.

తమిళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన పీఎస్ 2 రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైనా పార్ట్ 1 కంటే తక్కువ వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో 17 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 3.5 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లు, కేరళలో 2.8 కోట్లు, మిగిలిన చోట్ల 2.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా మొదటి రోజు పొన్నియన్ సెల్వన్ 2 అల్ ఇండియా ప్రకారం చూసుకుంటే 28.3 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ప్రీ రిలీజ్ కు ముందు బలహీనమైన బజ్ వల్లే మొదటి రోజు కాస్త తక్కువ సంఖ్యలకు కారణం కావచ్చు. అయితే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ లో భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయం రవి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. అశ్విన్ కాకుమాను, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తిబన్, లాల్, మోహన్ రామన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ 2 ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా వెండి తెర పైకి వచ్చింది.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి, మాటలు: జయమోహన్, కాస్ట్యూమ్స్: ఏకా లఖానీ, మేకప్: విక్రమ్ గైక్వాడ్, కొరియోగ్రఫీ: బృంద.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version