Homeబాక్సాఫీస్ వార్తలుపొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎన్నో ఏళ్లుగా డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తూ వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, జయం రవిలతో పాటు ఇతరుల భారీ తారాగణం కూడా ఉంది.

కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల కూడా భారతదేశం అంతటా పర్యటించి ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిని కలిగించింది. కాగా చోళ రాజవంశం, వారితో పాండ్య రాజుల వైరం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం విస్తృతంగా చేసిన ప్రచార వ్యూహాలు సినిమా క్రేజ్ ను పెంచేందుకు దోహద పడ్డాయి. కాగా నిన్ననే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద అన్ని ప్రాంతాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా తమిళ వెర్షన్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం.

అందరూ ఊహించిన విధంగా ఈ సినిమా తొలిరోజున అన్ని ప్రాంతాలలో బ్రహ్మాండమైన వసూళ్లను తెచ్చుకుంది.

READ  Box-Office: 20 కోట్ల షేర్ మార్కును దాటిన కార్తికేయ-2

తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 5.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, తమిళనాడులో 27 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కేరళలో 3.3 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 5.5 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్, మిగిలిన ప్రాంతాల్లో (Rest of, India) 4 కోట్ల రూపాయల వరకు వసూళ్లను సంపాదించింది. ఆ రకంగా దేశ వ్యాప్తంగా గ్రాస్ లెక్క కడితే 46 కోట్లకు చేరుకుంటుంది.

కాగా ఓవర్సీస్ లో మొత్తం కలెక్షన్లు ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తొలి రోజు దాదాపు 5 మిలియన్ వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 85 కోట్ల వరకూ ఉంటుంది.

ఇక కేవలం తమిళ వెర్షన్ ఓపెనింగ్‌ కలెక్షన్స్ వరకూ చూసుకుంటే, పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ సాధించింది. తొలిరోజు 75 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు (తమిళ వెర్షన్ మాత్రమే) చేసిన మొదటి చిత్రంగా నిలిచింది.

అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే తమిళనాడులో మూడు నాలుగు రోజుల వరకూ ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఎంత నిలకడగా రాణిస్తుంది అనేది చూడాలి.

READ  Box-Office: బ్రహ్మస్త్ర రెండు రోజుల ఇండియా వైడ్ కలెక్షన్లు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories