Homeసినిమా వార్తలుPonniyan Selvan Teaser: మణిరత్నం తెరకెక్కించిన మరో అద్భుతం

Ponniyan Selvan Teaser: మణిరత్నం తెరకెక్కించిన మరో అద్భుతం

- Advertisement -

అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్‌’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా భారీ క్యాస్టింగ్‌తో కూడా రూపొందుతోంది.. విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా పార్ట్1 ను సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే విక్రమ్, కార్తి, ఐశ్వర్య, త్రిష లకు సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. దశల వారీగా సినిమా పై ప్రేక్షకులకి మరింత ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టీజర్ కూడా విడుదల చేశారు.

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పొన్నియన్ సెల్వన్-1 టీజర్‌ను లాంచ్ చేస్తూ,చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమిళ భాషలో స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. అలాగే మలయాళ టీజర్‌ను మోహన్ లాల్, కన్నడ టీజర్‌‌ను రక్షిత్ శెట్టి.. హిందీ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేశారు. ఆ రకంగా చూస్తే చిత్ర యూనిట్ పబ్లిసిటీ భారీగానే ప్లాన్ చేశారు.ఇక టీజర్ విజయానికి వస్తే.. ” ఈ కల్లు, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చి పోవడానికే” అంటూ విక్రమ్ పలికిన డైలాగుల వెనుక ఆంతర్యం ఏమిటో అని ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా టీజర్ ఉంది.

చోళ రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్ధాయిలో విడుదల కానుంది. బాహుబలి సీరీస్ లాగా PS-1 కూడా రెండు భాగాల్లో రానుండటం విశేషం. ఈ చిత్రానికి మణిరత్నం సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు అయిన ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

READ  OTT రిలీజ్ పై కొత్త నిబంధనలు అమలు లోకి తెస్తున్న తెలుగు సినిమా నిర్మాతల మండలి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories