ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘పొన్నియిన్ సెల్వన్’ (PS-1) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.500 కోట్లతో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష నటిస్తున్నారు.
సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నటీనటుల ఒక్కొక్కరి లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్, జయం రవి, కార్తి లుక్ విడుదల చేయగా.. వాటికి కాస్త మిశ్రమ స్పందన లభించింది.
అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మాజీ విశ్వ సుందరి అదరగొట్టేసిందని ప్రేక్షకులు అంటున్నారు. ప్రతీకారానికి అందమైన రూపం పజూహూర్ రాణి నందిని క్యారెక్టర్‌లో ఐశ్వర్య రాయ్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్ రవి వర్మన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారుప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో “పొన్నియన్ సెల్వన్” గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు భారీ తారాగణం కూడా నటిస్తుండడం, రెండు భాగాలుగా సినిమా తెరకెక్కడం వల్ల సినిమా పై అంచనాలు కూడా భారీ స్ధాయిలో ఉన్నాయి.