ప్రతి ఏడాది మాదిరిగా రానున్న 2025 సంక్రాంతికి కూడా పలు సినిమాలు ఇప్పటికే రిలీజ్ కి సంసిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది మహేష్ బాబు, వెంకటేష్, తేజ సజ్జ, నాగార్జున ల సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచి ఆడియన్స్ కి మంచి వీనుల విందు అందించాయి. అయితే 2025 సంక్రాంతి రిలీజ్ ల విషయమై కొన్నాళ్లుగా కొంత సందిగ్ధత వ్యకమవుతోంది. పక్కాగా ఏ మూవీ సంక్రాంతికి వస్తుంది అనే దానిపై ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం రానున్న సంక్రాంతికి ముగ్గురు స్టార్స్ యొక్క సినిమాలు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. వారు చెప్తున్నా వివరాల ప్రకారం రామ్ చరణ్ శంకర్ ల కాంబో పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ బాబీల NBK 109 మూవీ, అలానే వెంకటేష్ అనిల్ రావిపూడిల కలయికలో రానున్న సంక్రాంతికి వస్తున్నాం మూడు మూవీస్ ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.
వాస్తవానికి మెగాస్టార్ విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కొంత పెండింగ్ వర్క్ ఉండడంతో అది సమ్మర్ కి పోస్ట్ పోన్ కానుందని తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు స్టార్స్ లో సంక్రాంతికి ఎవరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.