నటి పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీనియర్ నటి పవిత్రా లోకేష్ కేసు పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, నరేష్‌తో తనకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నాయని పవిత్ర లోకేష్ శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి 15 యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. ఇందుకు బాధ్యులైన వ్యక్తి మూడు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
“నరేష్ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్‌సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్ర లోకేష్ శనివారం ఫిర్యాదు చేశారు. ఇలాగే మా ఇద్దరిపై ట్రోల్స్ నడుస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ మా గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పవిత్రా లోకేష్ పేర్కొన్నారు. ఆవిడ ఫిర్యాదు మేరకు కొన్ని ఆధారాలను కూడా జత చేసినట్లు సమాచారం.
ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పైనా, అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ల పైనా చర్యలు తీసుకోవాలని పవిత్రా లోకేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు శనివారం మీడియాకు వెల్లడించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ త్వరితగతిన విచారణ ప్రారంభించారు.
నటి పవిత్రా ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. నరేష్ భార్య రమ్య రఘుపతి పై కేసు నమోదు చేసిన పోలీసులు రామారావు అనే వ్యక్తికి నోటీసులు అందించారు. రామారావు ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. ఇంతమంది పేరుతో రామారావు యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేశారనే ఆరోపణలున్నాయి.
ఇటీవల మైసూరులోని ఓ హోటల్‌లో నరేష్, పవిత్రా లోకేష్ ఉండగా.. అక్కడికి వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఓ వీడియో విడుదల చేసిన పవిత్రా లోకేష్.. రమ్య మీడియా ముందుకొచ్చి పరువు తీశారని ఆరోపించారు.
అయితే ఆ గొడవ తర్వాత కూడా నరేష్, పవిత్రా జంటగా కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించారు… ఆయన అంత్యక్రియల సమయంలో వీరు ఇద్దరూ కలుసుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ మొత్తం వ్యవహారం పై పవిత్రా లోకేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.