ఇటీవల తాను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ చూసేందుకు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి విచ్చేసారు అల్లు అర్జున్. అయితే ఆ సమయంలో భారీ తొక్కిసలాట జరుగడంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆ ఘటన పై వారి కుటుంబానికి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్, ఆపై వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది.
ఇక ఇటీవల ఆ దుర్ఘటనకు సంబందించి అల్లు అర్జున్ అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పుష్ప 2 ప్రీమియర్ నిమిత్తం రెండు రోజుల ముందుగానే తాము పోలీస్ బందోబస్తు కోసం తాము దరఖాస్తు చేసుకున్నట్లు సంధ్య థియేటర్ యజమాన్యం తాము పెట్టుకున్న అర్జీ లేఖ రిలీజ్ చేసింది.
అయితే ఆ సమయంలో తమ పోలీస్ టీమ్ మొత్తం కూడా బిజీగా ఉన్నారని, అందుకే బందోబస్తు అందించలేకపోతున్నట్లు వారు మరొక లేఖ ద్వారా తిరిగి రిప్లై ఇచ్చారు. అయినప్పటికీ కూడా హీరోని మరియు వారి టీమ్ ని పుష్ప 2 ప్రీమియర్ కి సంధ్య థియేటర్ వారు ఎందుకు అనుమతిచ్చారో చెప్పాలని తాజాగా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి షోకాజ్ నోటీసు ఇచ్చారు. సంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.
రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు ప్రజలకు దారి చూపడానికి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదర్శించే సరైన సైన్ బోర్డులు లేవు, అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు, టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారని అన్నారు. మరి దీని పై సంధ్య థియేటర్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.