టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 నేడు భారీ అంచనాలతో అత్యధిక త్యేతర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ కి అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ 4 వ తేదీన 9.30 న పలు ప్రాంతాల్లో ప్రదర్శితం అయ్యాయి. కాగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఆ సమయంలో ప్రీమియర్ షో వీక్షించేందుకు ఫామిలీతో సహా విచ్చేసారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఒక్కసారిగా సంధ్య థియేటర్ చుట్టుప్రక్కల ప్రాంతంలో విపరీతంగా జనసందోరం ఏర్పడింది.
అయితే ఒక్కసారి అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్న సమయంలో ఆయనని చూసేందుకు జనం ఎగబడ్డారు, అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో అందులో రేవతి అనే 39 ఏళ్ళ యువతి మృతి చెందగా ఆమె కుమారుడు తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాగా జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105, 118 కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. మరి దీని పై అల్లు అర్జున్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.