Homeసినిమా వార్తలుతెలుగు సినీ పరిశ్రమ పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు

తెలుగు సినీ పరిశ్రమ పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు

- Advertisement -

సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా బయట సమాజంలో జరిగే సంఘటనల పై కూడా తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆయన ట్వీట్స్ కు కొందరు మద్దతును ఇవ్వగా.. మరికొందరు వోడ్కా ట్వీట్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ వర్మ ఏమి ట్వీట్ చేసారంటే..

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా సోమవారం మధ్యాహ్నం అంటే ఈరోజు కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగుతాయి అని వారి కుటుంబ సభ్యులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ దూరారు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, అలాగే గొప్ప నిర్మాత అయిన మనిషి కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేరా అంటూ తెలుగు సినిమా పరిశ్రమను అత్యంత స్వార్థ పరమైనదిగా పేర్కొంటూ తీవ్రంగా మండి పడ్డారు.

READ  ధనుష్ 3 సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

ఇక అదే వరుసలో ఆయన ఇండస్ట్రీలోని సీనియర్ మరియు స్టార్ హీరోలు, నటులని కూడా ట్యాగ్ చేశారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణగారిని, మురళీమోహన్ గారిని, మెగాస్టార్ చిరంజీవిగారిని, మోహన్ బాబుగారిని, నందమూరి బాలకృష్ణ గారిని , ప్రభాస్ ,మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ వంటి అందరినీ ఈ విషయం మీద ట్యాగ్ చేస్తూ.. రేపు ఇదే దుస్థితి మీకు కూడా ఎదురు కాక తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని ఆయన అన్నారు.

మీకు మనసు లేకపోయినా పరవాలేదు. కనీసం మీ చావుకయినా విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇవ్వండి .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపండి అంటూ లోగడ షూటింగ్ ఖర్చు ఎక్కువ అయిపోతోంది అని నెలరోజుల పాటు షూటింగ్ ఆపేసిన సంగతిని గుర్తు చేస్తూ దెప్పి పొడిచారు.

ఇక్కడ తప్పొప్పులు పక్కన పెడితే.. అసలు ఒక మహా మనిషి చనిపోయిన దశలో ఇలా తన కుహనా మేధావితనాన్ని ప్రదర్శించడం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే చెల్లుతుంది. వీలయితే కృష్ణంరాజు గారికి తన మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించి తన గౌరవాన్ని రామూ నిలబెట్టుకోవాలి.

కానీ ఇలాంటి విషాదకరమైన పరిస్థితిని తన అవసరానికి వాడుకునెంత స్థాయికి దిగజారడం మాత్రం అత్యంత హేయమైన చర్యకు పాల్పడటం అవుతుంది. ఇలాంటి పనుల వల్ల రామ్ గోపాల్ వర్మ తన గౌరవాన్ని తానే తగ్గించినట్లు అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

READ  ఆ పచ్చబొట్టు తీసేయను - నాగ చైతన్య

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories