మైత్రీ మూవీ మేకర్స్ వారు తాజాగా నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి.
కాగా ఈ సినిమాలతో నైజాంలో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ వారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో శుభారంభం పొందాలని ఆశించారు. ఏషియన్ గ్రూప్ కు చెందిన సునీల్ నారంగ్ వంటి వారు నిష్ణాతులైన వారితో పాటు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా రాజ్యం ఏలుతున్న దిల్ రాజుతో మైత్రీ సంస్థ పోటీ పడింది.
కాగా మైత్రీకి పోటీ గా అజిత్ నటించిన తునివు, విజయ్ వారిసు చిత్రాలను స్వయంగా దిల్ రాజు విడుదల చేసి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్లో తన బలాన్ని చూపించాలి అనుకున్నారు.
అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ చిన్న షేరింగ్ సమస్య తెరపైకి వచ్చింది. ఈ సోమవారం నుంచి మల్టీప్లెక్స్ లు 45 శాతం వాటాను ఆఫర్ చేస్తుండగా, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు 55 శాతం వాటా ఇవ్వాలని మైత్రీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయం పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, అందుకే సోమవారం నుంచి సినిమాలకు షేర్లు లెక్కించడం లేదని తెలుస్తోంది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య రెండు వారాల పాటు అద్భుతంగా రన్ అవుతూ ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 100 కోట్ల షేర్ మార్కును దాటిన ఈ సినిమా ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. వాల్తేరు వీరయ్య అన్ని ఏరియాల్లో చాలా సునాయాసంగా బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించింది.
ఇక వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి సీజన్ లో పోటీ పడ్డ బాలకృష్ణ వీరసింహారెడ్డి నిజానికి బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది. మొదటి రోజు బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవ్వడంతో పాటు ఓపెనింగ్ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. కానీ పండగ రోజులు పూర్తయిన తర్వాత వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ కు గొప్ప పండుగ బహుమతులను ఇచ్చాయి.