Homeసినిమా వార్తలుపెద్ద మనసుతో అందరినీ ఆశ్చర్యపర్చిన ప్రభాస్

పెద్ద మనసుతో అందరినీ ఆశ్చర్యపర్చిన ప్రభాస్

- Advertisement -

హీరో ప్రభాస్ కి పెదనాన్న కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యం మరియు అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రభాస్ ని హీరోగా నిలబెట్టి తన కెరీర్ తీర్చిదిద్దిడంలో ఆయన పెదనాన్న కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం భారతదేశంలో గొప్ప హీరోలలో ఒకరుగా నిలిచారు. తెలుగు నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన మీద ఉన్న అభిమానంతో కృష్ణంరాజు గారికి ఉన్న రెబల్ స్టార్ బిరుదునే అభిమానులు ప్రేమతో ప్రభాస్ కి ఇచ్చారు.

కృష్ణంరాజు లేకపోయి ఉంటే ఈ ప్రభాస్ లేడని ఎన్నోసార్లు స్వయంగా చెప్పుకొచ్చారు ప్రభాస్. తన తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ కృష్ణంరాజును పట్టుకొని ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. కాగా ఆ సమయంలో నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి అన్నీ తానై చూసుకున్నారు కృష్ణంరాజు. అలాంటి పెద్ద దిక్కు హఠాత్తుగా మూగబోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఇన్ని రోజులూ తనకు అండగా ఉన్న పెద్ద దిక్కు ఇక నుంచి ఉండరని తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పరిస్థితిలో కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన వారికి ఎవరికి కూడా ప్రభాస్ ఏడుపును ఆపడం వల్ల కాలేదు. ఎంతమంది వచ్చి ఆయనను ఓదార్చాలని చూసినా ప్రభాస్ కంటి నుంచి కన్నీటి ధార ఆగలేదు.

READ  ఒకే ఒక జీవితం సినిమా వల్ల డాక్టర్ ని కలిశా - శర్వానంద్

అయితే ఇంతటి భాధాకరమైన పరిస్థితిలో కూడా ప్రభాస్ తన మంచి మనసుని చాటుకున్నారు. కృష్ణంరాజు గారి పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రెస్, ప్రజలు మరియు ప్రభాస్ అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. మరియు అలాంటి పరిస్థితిలో ప్రభాస్ వారికి ఆహారం ఏర్పాటు చేసారు, ఏర్పాట్లు మాత్రమే కాక ప్రతి ఒక్కరినీ పేరు పేరున భోజనం చేసి వెళ్లమని మరీ మరీ చేప్పారట. ఇది నిజంగా ప్రభాస్ యొక్క మంచి హృదయాన్ని చాటుతుందని, కేవలం పేరులో రాజు ఉండటం కాకుండా ఆయన ప్రవర్తన నిజంగా రాజు తరహాలో ఉందని అందరూ అంటున్నారు. కాగా ఆ సమయంలో అక్కడికి వెళ్ళని వారు.. ఇతరుల ద్వారా ఈ విషయం తెలుసుకుని ప్రభాస్ మనసున్న డార్లింగ్ అని ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇక కృష్ణంరాజు మృతి వార్త తెలియగానే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేసారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తమ ఇంటికి తరలించాక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలు సందర్శించారు.

READ  రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత .. షాక్ లో తెలుగు సినీ పరిశ్రమ

ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్- మహేష్- ఎన్టీఆర్- నాని తదితరులు ఉన్నారు. మురళీమోహన్- మోహన్ బాబు- దర్శకులు త్రివిక్రమ్- రాఘవేంద్రరావు తదితరులు కృష్ణంరాజుకు నివాళులర్పించారు. అనంతరం వీరంతా ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories