Homeసినిమా వార్తలురికార్డు ధరకు అమ్ముడైన 'పెద్ది' ఆడియో రైట్స్

రికార్డు ధరకు అమ్ముడైన ‘పెద్ది’ ఆడియో రైట్స్

- Advertisement -

ఇటీవల శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజెర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీని అనంతరం ఉప్పెన దర్శికుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పెద్ది. 

ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా వెంకట సతీష్ కిలారు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. 

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. కాగా విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ ని ప్రముఖ ఆడియో సంస్థ టి. సిరీస్ వారు రూ. 25 కోట్లకు దక్కించుకున్నారు. 

READ  Chhaava OTT Streaming Details 'ఛావా' ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

కాగా ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పాలి. మరోవైపు పెద్ది సినిమాని రాంచరణ్ ఫాన్స్ తో పాటు అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తుస్తున్నారని తప్పకుండా ఈ మూవీ రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకోవటం ఖాయం అంటోంది టీమ్. కాగా ఈ సినిమా 2026 మార్చి చివరలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది

Follow on Google News Follow on Whatsapp

READ  Boyapati to Himalayas for Akhanda 2 'అఖండ - 2' కోసం హిమాలయాలకు బోయపాటి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories