Home సినిమా వార్తలు Payal Rajput: తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ లో బోల్డ్ అండ్ గ్లామరస్...

Payal Rajput: తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ లో బోల్డ్ అండ్ గ్లామరస్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్ తన తాజా చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ లో బోల్డ్ అండ్ గ్లామరస్ లుక్ తో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు మంగళవారం ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ టైటిల్ సినిమా పై అంచనాలను పెంచగా, అజయ్ భూపతి కొత్త సినిమా మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాయల్ రాజ్ పుత్ ఒక డేరింగ్ అండ్ ఎమోషనల్ రోల్ అయిన శైలజ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా విజయం పై అటు పాయల్ ఇటు అజయ్ ఇద్దరూ నమ్మకంగా ఉన్నారు.

90వ దశకం నేపథ్యంలో అజయ్ భూపతి ట్రేడ్ మార్క్ విలేజ్ బేస్డ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ రాజ్ పుత్ కళ్లలో కన్నీళ్లు, వేలి పై సీతాకోకచిలుకతో కూడిన హాఫ్ న్యూడ్ లుక్ కథ పై పలు ఊహాగానాలకు తావిస్తోంది. వీరి తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 కూడా బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ లు ఈ సినిమాతో మరింత ఎమోషనల్ పాయింట్ తో రాబోతున్నట్లు కనిపిస్తుంది.

ముద్ర మీడియా వర్క్స్ అధినేత స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎం నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ సహా నిర్మాతగా తన ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version