Home సినిమా వార్తలు Pawan will Became PM in 2034 2034లో పవన్ పీఎం అవుతారు : జానీ...

Pawan will Became PM in 2034 2034లో పవన్ పీఎం అవుతారు : జానీ మాస్టర్

pawan kalyan jani master

తెలుగు సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం తరపున పిఠాపురం నుండి ఎమ్యెల్యే గా పోటీ చేసిన పవన్, అక్కడ ఘన విజయం అందుకుని మరోవైపు డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాజకీయాల పరంగా పక్కాగా ప్రణాళికలతో సాగుతున్న పవన్, తాను చేస్తున్న సినిమాలకి సంబంధించి బ్యాలెన్స్ షూట్స్ ని కూడా త్వరలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక పవన్ ఎమ్యెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా తొలిసారిగా నిన్న తన బర్త్ డే ని జరుపుకున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా జనసేన పార్టీ కార్యకర్త మరియు సినీ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీయం అని, ఇక రాబోయే 2029 ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని, అలానే 2034లో ఏకంగా పీఎం అవుతారని కామెంట్స్ చేసారు. జానీ మాస్టర్ చేసిన ఆ కామెంట్స్ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియో చూసిన పలువురు నవ్వుతూ సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇటువంటి వారిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ఇటువంటి బేస్ లెస్ కామెంట్స్ వలన పవన్ పేరు ప్రతిష్టకు మరింతగా భంగం కలిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version