టాలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ పొలిటీషియన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఫుల్ గా బిజీ బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఆయన హీరోగా ప్రస్తుతం పెండింగ్ లో పెట్టిన మూడు ప్రాజక్ట్స్ యొక్క బ్యాలెన్స్ షూట్ ని త్వరలో పూర్తి చేసేందుకు ఆయా మూవీ యూనిట్స్ కొన్నాళ్లుగా ప్లాన్ చేస్తున్నాయి.
ఇక ఈ సినిమాలు అన్నింటిపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. కాగా అవి జ్యోతి కృష్ణ తీస్తున్న హరిహర వీరమల్లు, సుజీత్ ఓజి, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్. విషయం ఏమిటంటే ముందుగా వీటిలో సెప్టెంబర్ 22 నుండి హరిహర వీరమల్లు మూవీ బ్యాలెన్స్ షూట్ ప్రారంభం కానుండగా అక్టోబర్ లో ఓజి అలానే డిసెంబర్ లో ఉస్తాద్ మూవీస్ సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. పవన్ వేగంగా వాటి షూట్ ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.
కాగా ఈ మూవీస్ యొక్క బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో తీయనున్నట్లు తెలుస్తోంది. ఇక వీటిలో సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ వచ్చే ఏడాది మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నట్లు టాక్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.