ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 మూవీ యొక్క ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన పై తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. అయితే ఆయన ఈ ఘటన పై సంచలన కామెంట్స్ చేసారు.
నిజానికి అటువంటి దుర్ఘటన జరగడం ఎంతో దురదృష్టకరం అని, ఆ సమయంలో రేవతి గారి మృతి, వారి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ప్రాణాపాయంగా మారిన విషయం తనని ఎంతో కలిచి వేసిందని అన్నారు. అయితే తొక్కిసలాట విషయంలో ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కాబట్టే ఒక హీరోను కూడా అరెస్ట్ చేయగలిగారు. నిజానికి గోటితో పోయేదాన్ని అనవసరంగా గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. ఈ ఘటనలో నాపై కేసులు పెట్టినా నేను అడ్డుపడే వాడిని కాదు.
చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరి చుట్టం కాదు. మహిళ మృతి తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించిస్తే బాగుండేది. సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇస్తే బాగుండేది. ఆ దుర్ఘటన పై అల్లు అర్జున్ కూడా ఎంతో పశ్చాత్తాప పడ్డారని పవన్ తెలిపారు. సీఎం రేవంత్ పేరు చెప్పలేదనే అరెస్ట్ చేపించాడు అనడం ఏమాత్రం సమంజసం కాదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. ఇకపై ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, కోర్టు తీర్పుని అనుసరించాలిందే అని చెప్పారు పవన్