పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు యువ దర్శకులు హరీష్ శంకర్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్ ఓజీ సెట్స్ లో జాయిన్ అయ్యారు.
‘ఓజీ’ షూటింగ్ వారం గత రోజులుగా ముంబైలో జరుగుతోంది. దర్శకుడు సుజీత్ చిత్రీకరిస్తున్న తీరు పట్ల పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా ఉన్నారని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముంబైలో వారం రోజుల పాటు జరిగిన ఓజీ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని, ఇప్పుడు చిత్ర యూనిట్ షూటింగ్ కోసం పుణెకు వెళ్తుందని, మే మొదటి వారంలోగా ఈ షెడ్యూల్ పూర్తవుతుందని అంటున్నారు.
ఈ చిత్రంలో అద్భుతమైన మరియు ఆసక్తికరమైన తారాగణం, సాంకేతిక బృందం ఉంటుందని, వారి వివరాలను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వర్ధమాన దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. వరుస షెడ్యూల్స్ నిర్వహించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.