పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి విడుదల చేసే చిత్రం రీమేక్ చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో రీమేక్ లతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. గబ్బర్ సింగ్ లాంటి రీమేక్ లు ఆయన బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఆయన చేసిన రెండు సినిమాలు కూడా రీమేక్ కావడంతో ఆయన అభిమానులు ఆయన నుంచి స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక రీమేక్ సినిమాలు తీయడం వల్ల లాంగ్ రన్ పై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని, తద్వారా సినిమాకి అనుకున్న దానికంటే తక్కువ కలెక్షన్స్ వస్తాయని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. ఇక పీరియాడిక్ జానర్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు పై వారు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క మొదటి గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ దృష్ట్యాహరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వరసగా వాయిదా పడుతూ వస్తోంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇలా హరి హర వీరమాల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ తదుపరి థియేట్రికల్ రిలీజ్ గా వినోదయ సీతం రీమేక్ ఉండనుంది. కాగా వచ్చే వారంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లి వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తున్నారు.