Home సినిమా వార్తలు పవన్ కళ్యాణ్ – సముద్రఖని సినిమా ప్రారంభం

పవన్ కళ్యాణ్ – సముద్రఖని సినిమా ప్రారంభం

తమిళ న‌టుడు,ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ గా ఎన్నో విజయాలను అందుకున్న సముద్రఖని గతేడాది ‘వినోదయ సీతం’తో మెప్పించారు. తమిళంలో మంచి పేరున్న సహాయక నటుడు తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో సముద్రఖని కూడా దేవుడు/సమయం పాత్రలో కనిపించాడు.

ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అంతే కాకుండాతెలుగు రీమేక్ కూడా సముద్రఖనే డైరెక్ట్ చేస్తారని, తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య పోషించిన పాత్రలలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వూ లోసముద్రఖని తాను ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని, తనలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనను డైరెక్ట్ చేస్తానన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని ఆయన చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.జూలై 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.జీ స్టూడియోస్ & ఫార్చ్యూన్4 ప్రొడక్షన్ సహా నిర్మాతలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version