పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినీ కెరీర్ తో పాటు ఇటు పొలిటికల్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5న ప్రారంభమైందని చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది. పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకుని కూర్చొని ఉన్న ఒక పోస్టర్ ను నిర్మాతలు షేర్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ మొదలైందనే వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకపోగా.. ఈ సినిమా సెట్స్ నుండి మరో కొత్త లుక్ పిక్ లీక్ కావడం వారిని మరింత ఉత్సాహపరిచింది. లీకైన పిక్ లో పవన్ కళ్యాణ్ లేత గడ్డం, మీసంతో కనిపిస్తున్నారు. నీట్ హెయిర్ మరింత ఆకర్షణను జోడించింది. ఈ ఫోటో అభిమానులను ఎంతగానో అలరించగా, వారంతా తమ అభిమాన హీరో కొత్త లుక్ చూసి మురిసిపోయారు.
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని అందరికీ తెలిసిన విషయమే, అందుకే అందరూ ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ గెటప్/లుక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ప్రేక్షకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించే పక్కా బ్లాక్ బస్టర్ ఇవ్వడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుందాం.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. ఇక ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు