Homeబాక్సాఫీస్ వార్తలుBox Office: స్పెషల్ షోలలో అల్ టైం రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ జల్సా

Box Office: స్పెషల్ షోలలో అల్ టైం రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ జల్సా

- Advertisement -

టాలీవుడ్ లో ఇటీవలే రి రిలీజ్ ల ట్రెండ్ మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఆ ట్రెండ్ ఏంటంటే స్టార్ హీరోల అభిమానులు.. వారి అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా, ఆ హీరో నటించిన పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయించే ట్రెండ్. ఆగస్టు 9న మహేష్ బాబు పోకిరి సినిమా ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా అత్యధిక స్క్రీన్స్ ల్లో రీ రిలీజ్ చేసిన మహేష్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు . ఆ క్రమంలో రీ రిలీజ్ షోలు మరియు సంబరాలలో పోకిరి రికార్డు సృష్టించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకు మించి అన్నట్లుగా జల్సా సినిమాను రీ రిలీజ్ చేసి తమ సత్తా ఏంటో చూపించారు. 500 షోలు వేసి రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరగగా.. మొత్తం అయ్యేసరికి ఆ సంఖ్య దాదాపు 750 కి పెరగటం విశేషం. ఈ రి రిలీజ్ ను ఒక సవాలుగా తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ మరియు థియేటర్ ల వద్ద సందడిని అసలు ఎవరూ ఊహించని స్థాయిలో జరిపి అందరినీ ముక్కున వేలేసుకునెలా చేసారు అంటే అది అతిశయోక్తి కానే కాదు.

జల్సా సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. కమలిని ముఖర్జీ, పార్వతీ మెల్టన్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీతో పాటు అంతర్లీనంగా ప్రధాన పాత్ర అయిన సంజయ్ సాహుకు ఒక భావోద్వేగమైన అంశం కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా సెకండాఫ్ లో పవన్ మరియు బ్రహ్మీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంవత్సరంలో వేసవి కానుకగా విడుదలైన జల్సా సినిమాకు ఆ సమయానికి విశేష స్థాయిలో క్రేజ్ ఉండింది. భారీ అంచనాల నడుమ తొలిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము దులిపి తెలుగు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అల్ టైం టాప్ 2 చిత్రంగా నిలిచింది.

READ  హీరో బాలకృష్ణ - దర్శకుడు గుణశేఖర్ లకు సుప్రీం కోర్టు నోటీసులు

ఆ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అప్పట్లో ఒక ప్రత్యేక అంశంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది సినిమాకి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టింది. ఇక పవన్ జల్సా సినిమా రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ మేరకు పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా స్పెషల్ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు, మొత్తం అన్ని షోలకు కలుపుకుని గ్రాస్ కలెక్షన్స్ ద్వారా నైజాం నుంచి దాదాపు 1.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, కృష్ణా – 21 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 14 లక్షలు, నెల్లూరు నుంచి 10 లక్షలు ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం దాదాపు 2.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ 2.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ రికార్డ్ నెలకొల్పింది.

READ  బుల్లితెర పై RRR Vs KGF 2

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories