ఏడాది క్రితమే దర్శకుడు సురేందర్ రెడ్డి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. సురేందర్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ తొలిసారి చేయబోతున్న సినిమా కావడంతో ఈ వార్త చాలా మంది అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. కానీ నెమ్మదిగా, ఈ ప్రాజెక్ట్ గురించి e రకమైన వార్తలు రాకపోవడంతో సినిమా నిలిపివేయబడిందని అందరూ అనుకున్నారు. సురేందర్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ మధ్య సృజనాత్మక విభేదాల కారణంగా.. చాలా మంది పరిశ్రమ సభ్యులు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కూడా పేర్కొన్నారు.
అయితే తాజాగా ఈ సినిమా పై చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, సినిమా ఏమీ ఆగిపోలేదు అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా బిజీగా కారణంగా దీనిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి తన తదుపరి అఖిల్ తో తీస్తున్న చిత్రం ఏజెంట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని నిర్మాత రామ్ పేర్కొన్నారు. ఏజెంట్ సినిమా పూర్తి చేసిన తర్వాత సురేందర్ రెడ్డి తన దృష్టిని పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా వైపు మళ్లించనున్నారు అని సమాచారం.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా సురేందర్ రెడ్డితో తన సినిమాకి ముందు పలు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు క్రిష్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కించి భారీ విజయం సాధించాలనే పట్టుదలతో ఆ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక సినిమాని చేయాల్సి ఉంది. ఇక తమిళ నటుడు మరియు దర్శకుడు తెలుగులోనూ సుపరిచితుడు అయిన సముద్రఖని తో వినోదాయ సితం రీమేక్ ను కూడా ఓకే చేశారు. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి తేజ్ కూడా కనిపిస్తారు. త్వరలోనే ఈ చిత్రం కూడా షూటింగ్ ప్రారంభించనుంది.
ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం కూడా సన్నద్ధం అవ్వాలి. అటు రాజకీయం ఇటు సినిమాలతో పవర్ స్టార్ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. మరి ఆయన అన్ని పనులను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగి అన్నిట్లోనూ విజయం సాధించాలని కోరుకుందాం.