Homeసినిమా వార్తలుPawan Kalyan: రాబోయే సినిమాలో ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రాబోయే సినిమాలో ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో డీవీవీ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. కాగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన పోషించే పాత్ర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు అని కూడా అంటున్నారు.

సాహో వంటి పరాజయం నుంచి దర్శకుడు సుజీత్ స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కూడా కావడంతో సినిమా యొక్క కంటెంట్ పట్ల అభిమానులు చాలా పాజిటివ్ గా ఉన్నారు.

READ  Rajamouli: ఎట్టకేలకు బాహుబలి సిరీస్ కంటే ఆర్ ఆర్ ఆర్ ప్రభావం పెద్దదని నిరూపించిన రాజమౌళి

ప్రస్తుతానికి ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు కానీ ఓజీ అనే పేరుతో ప్రచారంలో ఉంది . ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు చాలా స్కోప్ ఉంటుందని అన్నారు. జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సోదరుడి పాత్రలో ఓ యువ హీరో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.

గ్యాంగ్ స్టర్ గా సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన నటించిన బాలు, పంజా చిత్రాలు గ్యాంగ్ స్టర్స్, గన్స్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు కానీ పైన చెప్పినట్టు ఈ సినిమాతో సుజీత్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందిస్తాడనే ఫీలింగ్ పవన్ అభిమానుల్లో ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Rajinikanth: బాలకృష్ణ వీరసింహారెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories