టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచి విజయఢంకా మ్రోగించారు. అలానే పిఠాపురం ఎమ్యెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన పవన్ ప్రస్తుతం ఆంధ్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
మరోవైపు ఇప్పటికే తాను కొంతమేర షూట్ చేసిన ఓజి, హరిహర వీరుమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను త్వరలో పూర్తి చేసేందుకు సంసిద్ధం అవుతున్నారు పవన్. కాగా వీటిలో ముందుగా ఓజి, ఆ తరువాత మిగతా రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. విషయం ఏమిటంటే, వీటి అనంతరం స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డితో ఒక మూవీని పవన్ చేయనున్నారని, దానిని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఘనంగా నిర్మించనున్నారని గతంలో పలు న్యూస్ మీడియా మాధ్యమాల్లో వచ్చాయి.
విషయం ఏమిటంటే, తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా ఈ మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, దర్శకడు సురేందర్ రెడ్డితో పాటు తమ టీమ్ అంతా కూడా మూవీ కోసం రెడీగా ఉన్నాం అని, అయితే పవన్ గారి నుండి గ్రీన్ సిగ్నల్ తో పాటు ఆయన కాల్షీట్స్ లభించాల్సి ఉందని అన్నారు. కాగా ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా ఇది యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు టాలీవుడ్ టాక్.